పెళ్లి పేరుతో కానిస్టేబుల్‌ టార్చర్ కి యువతి బలి ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 20 April 2022

పెళ్లి పేరుతో కానిస్టేబుల్‌ టార్చర్ కి యువతి బలి !


తెలంగాణ లోని ములుగు జిల్లా ఏటూరు నాగరంలోని అంగన్‌వాడి కేంద్రంలో సూపర్‌వైజర్‌గా సంగీత విధులు నిర్వహిస్తోంది. మృతురాలిది స్వగ్రామం హనుమకొండ జిల్లా శాయంపేట శాయంపేట మండలం  మందరిపేట. హనుమకొండలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సర్వేష్‌యాదవ్, సంగీతకు పరిచయమయ్యాడు. కాకతాళీయంగా పరిచయమైన సర్వేష్‌ యాదవ్ మృతురాలు సంగీతను ఇష్టపడ్డాడు. పదే పదే ఫోన్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాని నువ్వు ఒప్పుకోకపోతే బాగోదని వేధించసాగాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా ఉన్న సర్వేష్‌ పెట్టే టార్చర్ భరించలేకపోయింది. ఇంట్లో  పెద్దలకు చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయింది. వేరే దారి లేకపోవడంతో సంగీత సోమవారం ఏటూరు నాగారంలో డ్యూటీ ముగించుకొని మందరిపేటలోని ఇంటికి చేరుకుంది. రాత్రి 9గంటల సమయంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందుతాగింది. ఆ తర్వాత జరిగిన విషయాన్ని తన తల్లితో చెప్పుకుంది. విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన పరకాలలోని సౌందర్య ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచించింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తన బిడ్డను కానిస్టేబుల్‌ సర్వేష్‌ పెళ్లి చేసుుకుంటానని వేధించడం వల్లే చనిపోయిందని మృతురాలి తండ్రి వీరయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. పరిచయం పేరుతో ఫోన్ నెంబర్‌ తీసుకొని పదే పదే కాల్స్ చేయడం, ఫోన్‌లో పెళ్లి ప్రస్తావన వేరు తెచ్చి వేధించడం తట్టుకోలేకపోయింది. ఈ విషయాన్ని తమతో చెప్పుకోలేక కానిస్టేబుల్ సర్వేష్‌ యాదవ్‌ ని ఏమి చేయలేక తనలో తానే కుములిపోయిందని సంగీత తండ్రి వీరయ్య పోలీసులకు చెప్పాడు. తన బిడ్డ చావుకు కారణమైన ట్రాఫిక్ కానిస్టేబుల్ సర్వేష్ యాదవ్‌ని వెంటనే అరెస్ట్ చేసి అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సంగీత కుటుంబ సభ్యులు. మృతురాలి తండ్రి కంప్లైంట్ ఆధారంగా కానిస్టేబుల్‌ సర్వేష్‌యాదవ్‌పై కేసు నమోదు చేసినట్లుగా శాయంపేట ఎస్‌ఐ వీరభద్రరావు తెలిపారు. 

No comments:

Post a Comment