యువ వ్యాపారస్తులకు టీఎస్ఆర్టీసీ ఆఫర్ !

Telugu Lo Computer
0


టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమస్యల పరష్కారం చేస్తున్నారు. ఆర్టీసీ ఎండీ అయినప్పటి నుంచి తనదైన శైలిలో ప్రయాణికుల ఆఫర్స్ ఇస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ తగ్గట్టుగా ఆర్టీసీపై మీమ్స్ కూడా పెడుతున్నారు. దీంతో అందరినీ ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు సరికొత్తగా నూతన వ్యాపారస్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కొత్తగా వ్యాపారం రాణించాలని అనుకుంటున్నారా.. మీకు రద్దీగా ఉండే చోట స్థలం దొరకటం లేదా మరెందుకు ఆలస్యం ఆర్టీసీ ఇస్తున్న బంపర్ ఆఫర్ వినియోగించుకోండి. ఎంజీబీఎస్‌లో యువ వ్యాపారస్తులకు నవ అవకాశం.. భారతదేశంలోనే 3వ అతిపెద్ద బస్సు టెర్మినల్లో మీ కొత్త వ్యాపారం మొదలు పెట్టి.. మీ జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించండని.. అవసరమైన వారు ఎంజీబీఎస్‌లోని స్టాల్స్ బుక్ చేసుకునే సదావకాశం కల్పించారు. దీని ప్రత్యేకంగా స్టాల్ బుకింగ్‌పై 30 శాతం తగ్గింపు కూడా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన టెండర్ ఫారమ్‌లను www.//tender.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ విషయం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)