త్వరలో పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్లు !

Telugu Lo Computer
0


రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఇప్పటివరకూ ఐఆర్సీటీసీ లేదా నేరుగా స్టేషన్‌కు వెళ్లి బుక్ చేసుకోవడం మాత్రమే తెలుసు. ఇక నుంచి టికెట్ బుకింగ్ కోసం రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. పోస్టాఫీసుల్లో సైతం రైల్వే టికెట్ బుకింగ్ సౌకర్యం కలగజేయనునట్లు  కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్  వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో స్టేషన్‌ను ప్రపంచస్థాయి స్టేషన్‌గా అభివృద్ధి చేసిన సందర్భంగా ఆయన అక్కడ్నించి మాట్లాడారు. వందే భారత్ రైలు త్వరలో ఖజురహో స్టేషన్‌లో నిలుస్తుందని కూడా చెప్పారు. ఇక నుంచి రైల్వే టికెట్ బుకింగ్ దేశవ్యాప్తంగా ఉన్న 45 వేల పోస్టాఫీసుల్లో కూడా ఉంటుందని చెప్పారు. త్వరలో దేశవ్యాప్తంగా రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిలను ముఖ్యమైన ప్రాంతాల్లో నిర్మిస్తామన్నారు. రామాయణ ఎక్స్‌ప్రెస్ వంటి భారత్ గౌరవ్ రైళ్లను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇక ఎలక్ట్రిఫికేషన్ ప్రక్రియ ఆగస్టు నాటికి పూర్తవుతుందన్నారు. అప్పట్నించి వందే భారత్ రైళ్లు కూడా ప్రారంభం కానున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)