హైదరాబాద్‌లో బాలయ్య మృతి

Telugu Lo Computer
0


ప్రముఖ సినీ నటులు శ్రీ బాలయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో శ్రీ బాలయ్య తుదిశ్వాస విడిచారు. నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించారు బాలయ్య. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడు అయ్యారు. నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చాటారు. ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం, నేరము - శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట లాంటి చిత్రాలు నిర్మించారు. దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు తెరకెక్కించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. శ్రీ బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. బాలయ్య మరణ వార్త తెలుసుకున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బాలయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలయ్య 1930 గుంటూరు జిల్లా చావపాడులో జన్మించారు. ఆయన సతీమణి పేరు మన్నవ కమలాదేవి. బాలయ్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ కూతుళ్లు హర్ష లత, మోహిని లత, కుమారుడు తులసి రాం ప్రసాద్. బాలయ్య తల్లిదండ్రులు మన్నావ గురవయ్య, మన్నావ అన్నపూర్ణమ్మ. బాలయ్య చెన్నైలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. కాలేజీ రోజుల్లో డ్రామాలపై ఆసక్తి పెరిగి తాపి చాణక్య అనే వ్యక్తి ద్వారా సినిమాల కోసం సలహాలు సూచనలు తీసుకున్నారు. ఆ తర్వాత 300కు పైగా తెలుగు సినిమాల్లో నటించారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పౌరాణిక సినిమాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. 2012లో బాలయ్యకు ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు కూడా దక్కింది. శోభన్ బాబు వాణిశ్రీ నటించిన చెల్లెలి కాపురం, సూపర్ కృష్ణ నటించిన నేరం శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త,రజనీకాంత్, శక్తి కపూర్ నటించిన వఫాదార్, పసుపుతాడు వంటి సినిమాలక బాలయ్య స్టోరీ రైటర్‌గా పనిచేశారు. 1981లో ఊరుకిచ్చిన మాట అనే సినిమాకు గాను.. బాలయ్యకు సెకండ్ బెస్ట్ స్టోరీ రైటర్ కింద నంది అవార్డు పురస్కారం లభించింది. కృష్ణం రాజు, జయప్రద నటించిన నిజం చెబితే నేరమా అనే సినిమాతో పాటు పసుపు తాడు,పోలీస్ అల్లుడు సినిమాలకు బాలయ్య దర్శకత్వం వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)