ప్రాణం తీసిన శోభనం ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల సాగర్‌ రింగ్‌రోడ్‌కు చెందిన సత్యనారాయణరాజు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు పత్తిగుడుపు కిరణ్‌కుమార్‌ (32)కు ఈ నెల 11వ తేదీ గుంటూరు జిల్లా తెనాలి వించిపేటకు చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహ తంతు పూర్తైన తర్వాత కొత్త జంట శోభనానికి ఈనెల 16వ తేదీన పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. వరుడు కిరణ్‌కుమార్‌ తన తల్లితండ్రులతో కలసి మాచర్ల నుండి బయలు దేరి గుంటూరులో బస్సు దిగాడు. ఇప్పుడే వస్తానని తల్లితండ్రులకు చెప్పి వెళ్ళిపోయాడు. కిరణ్ ఎంతకూ తిరిగిరాకపోవడంతో ఫోన్ చేయగా స్విఛ్ ఆఫ్ వచ్చింది. దీంతో అతడి గురించి బంధువులకు చెప్పి ఇద్దరూ తెనాలి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా కృష్ణానది ఎగువ ప్రాంతంలో మృతదేహం ఉందని తాడేపల్లి పోలీసులకు సమాచారం అందడంతో బయటకు తీసి పరిశీలించారు. పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది. జేబులోని సెల్ ఫోన్ పరిశీలించి సిం కార్డు తీసి మొబైల్లో వేసి కిరణ్ కుమార్ వివరాలు సేకరించారు. తల్లిదండ్రులకు సమాచారమివ్వగా మృతదేహం కిరణ్ ది గుర్తించారు. అతడి మృతికిగల కారణాలను ఆరా తీయగా తల్లిదండ్రులు విస్తుపోయే సమాధానం చెప్పారు. శోభనం అంటే భయంతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ విషయంలో ధైర్యం చెప్పాలని అతడి స్నేహితులకు చెప్పామని.. కానీ మనసులో భయం పెట్టుకొని ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడని బోరున విలపించారు. తొలిరేయి అంటే ఉన్న భయం, అపోహలు తల్లిదండ్రులను ఒంటరివారిని చేయడమే కాకుండా నవ వధువు నిండు నూరేళ్ల జీవితాన్ని బుగ్గిపాలు చేశాడని వాపోతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)