టీచరమ్మ జేబులో గన్ ?

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌లో కరీష్మ సింగ్ యాదవ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. నిన్న పని మీద మెయిన్ పురికి వచ్చారు. అయితే ఆమె ప్యాంట్ జేబులో తుపాకీ ఉండటం కలకలం రేగింది. గన్ తీసుకొని వస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు రంగంలోకి దిగి ఆమెను కొత్వాలీ ఏరియాలో చుట్టుముట్టారు. మహిళ కానిస్టేబుల్ ఆమెను జీన్స్ జేబులో నుంచి గన్ తీశారు. దీనిని కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. కరీష్మపై పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. టీచరమ్మ తుపాకీ తీసుకొని రావడంతో ఉత్కంఠ రేగింది. ఆమె ఎందుకు తుపాకీ తెచ్చుకుంది. పనిచేసే చోట కాక మెయిన్ పురి ఎందుకు వచ్చింది. మావోయిస్టులతో సంబంధం ఉందా..? లేదంటే మరే గ్రూపుతో క్లోజ్‌గా ఉంటున్నారా అనే చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు అయితే అన్నీ సశేష ప్రశ్నలే. ఏ కొశ్చన్‌కు ఆన్సర్ లేదు. పోలీసుల విచారనలో నిజ నిజాలు తేలాల్సి ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)