ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 10 April 2022

ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ !


ఆంధ్రప్రదేశ్ లో సగటు విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లు మాత్రమేనని, సాధారణంగా ప్రతీ వేసవిలో ను 204 మిలియన్ యూనిట్లకు చేరుతుందని పేర్కొంది. కానీ కోవిడ్ తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిపోయిందని.. పరిశ్రమలు, ఆర్ధిక లావాదేవీలు పూర్తి స్థాయిలో జరుగుతున్న కారణం గా 240 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం చేరిందని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత వినియోగం ఇప్పుడు జరుగుతోందని, రాష్ట్రంలోని అన్ని జెన్ కో  యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని ప్రకటన చేసింది. ప్రస్తుత సీజన్ లో  రూ. 1058 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశామని, జాతీయ ఎక్స్ఛేంజీల్లో లభ్యత లేని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు కొత విధించాల్సి వచ్చిందని వెల్లడించింది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, లేక పోతే గ్రిడ్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. అందుకే పరిశ్రమల వినియోగంలో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని చెప్పామని, ఇదీ ఇబ్బందే కానీ తప్పని పరిస్థితి అని వెల్లడించింది. వ్యవసాయ అవసరాల వినియోగించే విద్యుత్ ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉందని, ఆ తర్వాత పరిశ్రమలకు యధావిధిగా సరఫరా జరుగుతుందని పేర్కొంది.

No comments:

Post a Comment