మా మాతృభాషను మేం ప్రేమిస్తాం !

Telugu Lo Computer
0


దేశంలో ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీ మాట్లాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేశారు. "అమిత్ షా గారూ. మేం హిందీ ఎక్కడ మాట్లాడాలో, హిందీ ఎక్కడ నేర్చుకోవాలని మీరు కోరుకుంటున్నారో తెలుసుకోవాలను కుంటున్నాం" అని ఆయన అన్నారు. అంతేకాదు, మిస్టర్ హోమ్ మినిస్టర్. హోమ్స్ ను బ్రేక్ చేయొద్దు అని అన్నారు ప్రకాశ్ రాజ్. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దు. మా భిన్నత్వాన్ని మేం ప్రేమిస్తాం, మా మాతృభాషను మేం ప్రేమిస్తాం. మా ఆస్తిత్వాలను మేం ప్రేమిస్తాం. అంటూ స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)