శ్రీరామ నవమి ఊరేగింపు సందర్బంగా మత ఘర్షణలు

Telugu Lo Computer
0


గుజరాత్ లోని రెండు నగరాల్లో శ్రీరామనవమి సందర్బంగా మత ఘర్షణలు జరగడం కలకలం రేపింది. రెండు నగరాల్లో అదనపు పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు అధికారులు తెలిపారు.  శ్రీరామనవమి వేడుకల సందర్బంగా గుజరాత్ లోని ఖంభాట్ నగరంలో జరిగిన ఊరేగింపులో మత ఘర్షణలు జరిగి ఒకరు మరణించారు. శ్రీరామనవమి సందర్బంగా ఊరేగింపు జరుగుతున్న సమయంలో రెండు వర్గాల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను గొడవలు ఎక్కువ అయ్యి ఒకరి మీద ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో 65 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మరణించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చనిపోయిన వ్యక్తి పేరు, వివరాలు తెలియడం లేదని, అల్లర్ల కారణంగా తీవ్రగాయాలై ఆయన చనిపోయారని, వివరాలు సేకరిస్తున్నామని పోలీసు సూపరెండెంట్ అజిత్ రాజయన్ మీడియాకు చెప్పారు. హిమ్మత్ నగర్ లో కూడా శ్రీరామనవమి సందర్బంగా మతఘర్షణలు జరిగాయి. ఈ మతఘర్షణల్లో ఇద్దరికి తీవ్రగాయాలైనాయని పోలీసు సూపరెండెంట్ అజిత్ రాజయన్ మీడియాకు చెప్పారు. రెండు వేర్వేరు నగరాల్లో జరిగిన మతఘర్షణల కారణంగా ఒకరు చనిపోగా అనేక మందికి గాయాలైనారు. ఈ సందర్బంగా రెచ్చిపోయిన అల్లరిమూకలు పలు షాపులకు నిప్పంటించి వాటిని కాల్చి బూడిద చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)