యాక్సిడెంట్ అయిన కారు నుండి మందు బాటిల్స్ కోసం ఎగబడ్డ జనాలు

Telugu Lo Computer
0


బీహార్‌ లోని కైమూర్ వద్ద కారు రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. అందులోని ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. వారు పక్కకు వెళ్లడమే ఆలస్యం ఆ కారులో మందు కాటన్స్ ఉన్నాయని కనిపెట్టిన జనాలు ఎగబడ్డారు. దొరికినవాళ్లు దొరికినట్లు మందు బాటిల్స్ ఇళ్లకు తీసుకుపోయారు. అయితే ఆ కారులోని మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ‘వీరి సేవాగుణానికి, మందు పట్ల ఉన్న మంచితనానికి క్వారర్ల దండ మెడలో వేయాలి.. ప్రెసిడెంట్ మెడల్ ఫుల్ బాటిల్ గిఫ్ట్‌గా ఇవ్వాలి’ అని సరదాగా రాసుకొచ్చాడు ఓ నెటిజన్.

Post a Comment

0Comments

Post a Comment (0)