ఆగని పెట్రో మంట !

Telugu Lo Computer
0


శుక్రవారం విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు సామాన్యులపై మళ్లీ పెట్రోల్ బాదుడు మోపాయి. శనివారం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 80 పైసలు చొప్పున వడ్డించాయి. గడిచిన 12 రోజుల్లో 10 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 7.20 పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.61 సెంచరీ దాటేయగా.. డీజిల్ ధర మాత్రం 93.87కు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.116.30 పెరిగింది. అలాగే డీజిల్ ధర రూ.102.43 పెరిగింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.118.20 ఉండగా, డీజిల్ ధర రూ.103.94 పెరగగా, ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.57 పెరిగింది. డీజిల్ ధర లీటర్ రూ. 101.79 పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.21 పెరగగా, డీజిల్ ధర రూ. 98.28కు పెరిగింది.


Post a Comment

0Comments

Post a Comment (0)