దేశంలో 949 కొత్త కరోనా కేసులు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 14 April 2022

దేశంలో 949 కొత్త కరోనా కేసులు


దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న  1007 కరోనా కేసులు నమోదవగా, ఒక్కరు  మృతి చెందారు. ఈరోజు కొత్తగా 949 కరోనా బారిన పడితే, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా బాధితులు 4,30,39,972కు చేరారు. ఇందులో 4,25,07,038 మంది కరోనా నుంచి బయటపడ్డారు. 11,191 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,21,743 మంది చనిపోయారు. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.03 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.76 శాతమని, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 1,86,30,62,546 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది. ఇందులో 6,66,660 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది.

No comments:

Post a Comment