శ్రీలంకకు అప్పుగా 40 వేల టన్నుల డీజిల్‌

Telugu Lo Computer
0


తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు  భారత్‌ చేయుతనందిస్తున్నది. రవాణా రంగంలో కీలక పాత్ర పోషించే డీజిల్‌ను లంకకు అందించింది. బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువైన 40 వేల టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు అప్పుగా సరఫరా చేసింది. భారత్‌ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఓడ శనివారం ఉదయం శ్రీలంకకు చేరుకున్నది. దీనిని సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ ఆరు వేల టన్నుల డీజిల్‌ను అందించనుంది. శ్రీలంక రవాణా రంగంలో బస్సులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో మూడింటా రెండొంతుల వాహనాలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. వాటికి సరిపడా డీజిల్‌ అందుబాటులో లేకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. దీంతో రాజపక్స ప్రభుత్వం భారత్‌ సాయం కోరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)