అమరావతిపై ఏపీ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గత నెల 3వ తేదీన హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుకు సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 190 పేజీలతో కూడిన ఈ అఫిడవిట్‌లో ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది. ఈనెల 3లోగా సీఆర్‌డీఏ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా ఈ అంశాన్నే అఫిడవిట్‌లో ప్రధానంగా ప్రస్తావించింది. ఏప్రిల్ 2తో హైకోర్టు విధించిన డెడ్‌లైన్ ముగియనుండటంతో ప్రభుత్వం ఈ అఫిడవిట్ దాఖలు చేయగా.. రైతుల ప్లాట్లలో పనుల పురోగతిపై సీఎస్ సమీర్‌శర్మ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అమరావతిలో వివిధ పనులు పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం మరో నాలుగేళ్ల పాటు గడువు పొడిగించిందని సీఎస్ సమీర్ శర్మ అందులో తెలిపారు. దీంతో రైతుల ప్లాట్లు సహా ఇతరత్రా పనుల పూర్తికి తమకు 2024 జనవరి దాకా గడువు ఉందని ప్రస్తుతానికి ఈ పనులు పూర్తి కాలేదని కోర్టుకు వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)