పూణె మెట్రోలో టికెట్‌ కొని ప్రయాణించిన ప్రధాని

Telugu Lo Computer
0


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుణె మెట్రో రైలు ప్రాజెక్టును ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా టికెట్ కొనుగోలు చేసి మెట్రో రైలులో గర్వేర్ స్టేషన్‌ నుంచి ఆనంద్ నగర్ వరకు ప్రయాణం చేశారు. మోదీతోపాటు విద్యార్థులు కూడా ఉన్నారు. రైలులో తన పక్కన కూర్చున్న విద్యార్థులతో ప్రధాని సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ కార్యాలయం ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ మేరకు "మెట్రో ద్వారా పూణె ప్రజలకు అనుకూలమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుతుంది." అంటూ ట్వీట్‌ చేసింది. వీటిలో చిన్నారులతో కలిసి ప్రధాని మెట్రో రైల్లో కూర్చొని కనిపిస్తున్నారు. 32.2 కిలోమీటర్ల పుణె మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తవడంతో అందుబాటులోకి వచ్చింది. . ప్రస్తుతానికి మెట్రో రైళ్లు రెండు మార్గాల్లో తిరుగుతాయి. దీంతో వనజ్ నుంచి గార్వేర్ కాలేజ్ మెట్రో స్టేషన్ వరకు.. అలాగే, పీసీఎంసీ నుంచి ఫుగెవాడి మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. పూర్తిగా వ్యాక్సిన్‌ వేయించుకున్న ప్రయాణికులను మాత్రమే రైళ్లలోకి అనుమతించనున్నారు. అయితే పూణే మెట్రో ప్రాజెక్ట్ మొత్తం వ్యయం ₹ 11,400 కోట్లు కాగా 2016 డిసెంబర్ 24న ఈ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)