దంత వైద్యుడి ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్!

Telugu Lo Computer
0


హర్యానాలోని యమునా నగర్‌కు చెందిన నితీష్ చోప్రా (33) వృత్తిరీత్యా డెంటిస్ట్. అయితే తన భార్య బర్త్‌డే సందర్భంగా యాపిల్ వాచ్‌ను కొనుగోలు చేశాడు. తాను అనారోగ్యంగా ఉన్నట్లు నితీష్ నిర్ధారించుకుని రెండు సార్లు తన యాపిల్ వాచ్‌లో ఈసీజీ చెక్ చేసుకున్నాడు. హార్ట్ బీట్ అసాధారణంగా ఉన్నట్లు తేలింది. దీంతో తక్షణమే డెంటిస్ట్ కార్డియాలజిస్ట్‌ను సంప్రందించి పరీక్షలు చేయించుకున్నాడు. హార్ట్‌లో బ్లాక్‌లు ఉన్నట్లు యాంజియోగ్రాఫి రిపోర్టులో తేలింది. తప్పనిసరిగా స్టెంట్ వేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ నితీష్ భార్య నేహా నగల్ మీడియాతో మాట్లాడుతూ తన భర్త ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్ కంపెనీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. యాపిల్ సీఈవో టిమ్ కుక్‌కు ఈ-మెయిల్ ద్వారా సందేశం పంపానని చెప్పింది. మా వాచ్ ద్వారా అత్యవసరమైన సమయంలో వైద్య సహాయం లభించినందుకు సంతోషిస్తున్నానని, ఆరోగ్యంగా ఉండాలని టిమ్ కుక్ రిప్లై ఇచ్చినట్లు నేహా పేర్కొంది. నితీష్ చోప్రా మార్చి 8 నుంచి 12వ తేదీ మధ్యలో అనారోగ్యంగా ఉన్నాడని నేహా తెలిపింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారడం, ఇతర సమస్యలు ఉత్పన్నం కావడంతో యాపిల్ వాచ్‌లోని ఈసీజీ ఫీచర్ ద్వారా హార్ట్ బీట్ తెలుసుకోగలిగామని తెలిపింది. హార్ట్ బీట్ అసాధారణంగా ఉండటంతో.. హాస్పిటల్‌లోనూ ఈసీజీ, యాంజియోగ్రామ్ చేయించడంతో బ్లాక్‌లు ఉన్నట్లు తేలిందని ఆమె చెప్పింది. ఇంత చిన్న గాడ్జెట్ తన ప్రాణాన్ని కాపాడినందుకు నితీష్ చోప్రా సంతోషం వ్యక్తం చేశాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)