యూపీ సీఎం గద్దెపై అఖిలేశ్ యాదవ్‌ ?

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ అధికార పగ్గాలను చేపట్టబోతుందని మూడు సంస్థలు. ఇప్పటికే అన్ని ప్రముఖ సర్వేలు బీజేపీదే అధికారం అని పేర్కొనగా, మూడు సంస్థలు మాత్రం బీజేపీ భారీగా సీట్లను కోల్పోతుందని తేల్చి చెప్పాయి. ఎన్నికల పోలింగ్ ముగియగానే అన్ని సంస్థలూ ఎగ్జిట్ పోల్స్‌ను వెలువరించాయి. అందులో మాత్రం యూపీలో బీజేపీదే అధికారమని పేర్కొన్నాయి. అయితే.. 4పీఎం, ది పాలిటిక్స్ డాట్ ఇన్‌తో పాటు దేశబంధు కూడా యూపీలో అఖిలేశ్‌దే అధికారమని ప్రకటించాయి. సమాజ్‌వాదీకి 238 సీట్లు వస్తాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. ఇక.. బీజేపీ కేవలం 157 సీట్లలో మాత్రమే పాగా వేయనుందని పేర్కొన్నాయి. ఇక మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 6 సీట్లు, కాంగ్రెస్‌కు ఒకే ఒక్క సీటు వస్తుందని పేర్కొన్నాయి. దేశ బంధు అనే సంస్థ సర్వేలోనూ అఖిలేశే సీఎం అవుతారని తేలింది. ఈ సర్వే ప్రకారం సమాజ్‌వాదీకి ఈ సారి 228 నుంచి 244 సీట్ల వరకూ వచ్చే అవకాశాలున్నాయని తేల్చింది. ఇక బీజేపీకి 134 నుంచి 150 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని దేశబంధు పేర్కొంది. ఇక కాంగ్రెస్‌కు 9, బీఎస్పీకి 10, ఇతరులకు 24 సీట్లు వస్తాయని దేశబంధు పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)