తటస్థంగా ఉంటాం: జెలెన్‌స్కీ

Telugu Lo Computer
0


ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ రష్యా జర్నలిస్టులకు ఇంటర్వ్యూ ఇస్తూ ఒకవేళ యుద్ధం ఆగిపోతే తాము తటస్థంగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు జెలెన్‌స్కీ అన్నారు. దీని కోసం సెక్యూర్టీ గ్యారెంటీ ఇవ్వాలని, శాంతి ఒప్పందంలో భాగంగా తాము తటస్థంగా ఉండేందుకు అంగీకరిస్తామని జెలెన్‌స్కీ అన్నారు. ఒకవేళ తటస్థ వైఖరికి అంగీకరిస్తే, అప్పుడు తాము నాటోలో చేరబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. సుమారు 90 నిమిషాల పాటు వీడియో కాల్‌లో జెలెన్‌స్కీ పాల్గొన్నారు. అయితే థర్డ్ పార్టీలు తమకు హామీ ఇస్తే, అప్పుడు తాము తటస్థంగా ఉండబోనున్నట్లు ఆయన చెప్పారు. దీని కోసం రిఫరెండం కూడా నిర్వహించాలన్నారు. తటస్థంగా ఉండడం అంటే, ఇక ఉక్రెయిన్ నాటోలో చేరబోదని అర్థం. ఆ కూటమికి ప్రస్తుతం ఆ దేశం దూరంగా ఉన్నట్లు లెక్క. వాస్తవానికి రష్యా ఆక్రమణ చేపట్టడానికి ఇదే ముఖ్య కారణం కూడా. ఉక్రెయిన్ ఒకవేళ తటస్థంగా ఉండాలనుకుంటే అప్పుడు పశ్చిమ దేశాలు తమకు సపోర్ట్ ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 24వ తేదీకి ముందు రష్యా బలగాలు ఎలా ఉన్నాయో అలాంటి చోటుకే మళ్లీ వెళ్లాలన్నారు. జెలెన్‌స్కీ చేసిన ప్రతిపాదనకు రష్యా అంగీకరించడం కష్టంగానే కనిపిస్తోంది. ఉక్రెయిన్ దక్షిణ, తూర్పు భాగాల్లో ఇప్పటికే రష్యా పూర్తి ఆధిపత్యాన్ని చాటింది. ఈ దశలో జెలెన్‌స్కీ విధించిన షరతుకు రష్యా ఒప్పుకుంటుందో లేదో చెప్పలేం. రాజ్యాంగంలోనూ మార్పులు చేపట్టాలని జెలెన్‌స్కీ అన్నారు. ఇలా చేయాలంటే మరో ఏడాది కాలం పడుతుందన్నారు. మరి పుతిన్ అంత కాలం వేచి ఉండగలరా అన్నది మరో ప్రశ్న. తటస్థ వైఖరి కోసం ప్రజాభిప్రాయ సేకరణతో పాటు రాజ్యాంగపరమైన మార్పులు అవసరం అన్నారు. నెల రోజుల యుద్ధం తర్వాత తటస్థంగా ఉండేందుకు జెలెన్‌స్కీ పెట్టిన ప్రతిపాదన నిజానికి ఆశ్చర్యమే. ఎందుకంటే నాటోలో చేరవద్దు అని ముందే పుతిన్ హెచ్చించారు. ఆ షరతును కాదని జెలెన్‌స్కీ ప్రవర్తించారు. ఇప్పుడు తీవ్ర నష్టం జరగడంతో తటస్థ వైఖరికి మొగ్గుచూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రెండు దేశాల ప్రతినిధుల మధ్య తాజాగా టర్కీలో జరగనున్న చర్చలతో తటస్థ వైఖరిపై ఓ క్లారిటీ రానున్నది.


Post a Comment

0Comments

Post a Comment (0)