ఆగని పెట్రో బాదుడే బాదుడు...!

Telugu Lo Computer
0


అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర తగ్గినా దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతోంది. దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులే కారణమని అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతకొన్నిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. లీటర్ పెట్రోల్ పై 90 పైసలు పెరగగా, లీటర్ డీజిల్ పై 76 పైసలు ధర పెరిగింది. గడిచిన 8 రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ. 4.94 పెరగగా, డీజిల్ లీటర్ ధర రూ.4.89 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.21 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.91.47గా నమోదైంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.61, డీజిల్ ధర రూ.99.83గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.37, డీజిల్ రూ.101.23గా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.115.04గా ఉండగా.. డీజిల్ లీటర్ పై రూ. 101.43గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.04, డీజిల్ ధర రూ.99.25గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.94గా ఉండగా.. డీజిల్ లీటర్ ధర రూ.96కు పెరిగింది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.68కు పెరగగా, లీటర్ డీజిల్ ధర రూ.94.62కు పెరిగింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)