ఏపీ సీఎం పర్యటనలో బయటపడ్డ భద్రతా వైఫల్యం! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 28 March 2022

ఏపీ సీఎం పర్యటనలో బయటపడ్డ భద్రతా వైఫల్యం!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ నెల్లూరులో పర్యటించారు. గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన బయలుదేరి వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొన్నారు అనంతరం మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే, సీఎం వైఎస్‌ జగన్‌ నెల్లూరు జిల్లా పర్యటనలో భద్రతా వైఫల్యం బయటపడింది. మూడంచెల భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన విద్యార్థి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నాడు. అంతటితో ఆగకుండా.. సెల్‌ ఫోన్‌ కెమెరాలతో సీఎం వైఎస్‌ జగన్‌ దృశ్యాలను చిత్రీకరించాడు. చివరి నిమిషంలో ఈ ఘటనను గుర్తించిన పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు భద్రతా కారణాలతో ఆ ప్రాంతానికి మీడియాను అనుమతించని పోలీసులు విద్యార్థి అక్కడికి వచ్చేవరకు ఎందుకు పట్టించుకోలేదు అనేది చర్చనీయాంశంగా మారింది. 

No comments:

Post a Comment