కేసీఆర్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వం

Telugu Lo Computer
0


కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, పంజాబ్ రాష్ట్రంలో కొనసాగుతున్న విధానాన్నే తెలంగాణలో కొనసాగిస్తున్నట్లు  కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  తెలిపారు. కావాలనే కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ధాన్యం సేకరణలో రాష్ట్రం విఫలమైందని విమర్శలు గుప్పించారు. ముడి బియ్యం ఇస్తామని అన్నీ రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలోని రైతుల పట్ల వివక్ష చూపడం లేదన్నారు.  గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రంతో తాడో పేడో తేల్చుకొనేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయ్యారు. అందులో భాగంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కలిసేందుకు తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు  పియూష్ గోయల్ తో భేటీ అయ్యారు. ప్రధాన మంత్రి రాసిన లేఖను ఆయనకు ఇచ్చారు. అనంతరం మీడియాతో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడారు. తెలంగాణలో కొంతమంది నేతలు కేంద్రంపై అకారణంగా ఆరోపణలు గుప్పిస్తున్నారని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రైతుల విషయంలో సానుకూలంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తుందని…ఇందులో ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చిన విధంగా వ్యవహరించాలని సూచించారు. రా రైస్ కొన్ని రాష్ట్రాలు ఇచ్చాయని, ఈ విషయంలో సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ సర్కార్ కు సూచించడం జరిగిందన్నారు. ఫిబ్రవర 25న అన్ని రాష్ట్రాలను పిలిచి, ఎవరెంత ఇస్తారో అడిగినట్లు, రా రైస్ ఎంతిస్తారనే దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు ఎంత ధాన్యం (రా రైస్) ఇస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. తర్వాత మరో సమావేశం ఏర్పాటు చేయడం అప్పుడు కూడా ప్రశ్నించడం జరిగిందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు సమాచారం ఇచ్చినా, తామెంత ముడి బియ్యం ఇస్తామో తెలంగాణ చెప్పలేదన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతులను మభ్య పెడుతోందని తమకు అర్థమౌతోందన్నారు. మంత్రులు ఎలాంటి విజ్ఞప్తులు చేశారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రాలన్నీ ఎఫ్ సీఐ లతో ఒప్పందం చేసుకున్నట్లు, కేసీఆర్ చేతకానితనాన్ని కేంద్రంపై రుద్దాలని చూస్తున్నారన్నారు. గతం కంటే ఏడున్న రెట్లు తెలంగాణ నుంచి ధాన్యం సేకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అబద్దాలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ కూడా 25లక్షల మెట్రిక్ టన్నుల ముడిబియ్యం ఇస్తోందన్నారు. సమాచారం ఇవ్వకుండా రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఎలాంటి వివక్ష లేకుండా దేశమంతటా బియ్యం సేకరణ చేస్తుందని  కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ మరోసారి స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)