సజీవదహనం కంటే ముందు కొట్టారు ?

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న బీర్ భూం సజీవ దహనం ఘటన ప్రకంపనాలు సృష్టిస్తోంది. తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రదాన్ భాదు షేక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ప్రతిగా బోగ్ టూయి గ్రామంలో హింస చెలరేగింది. సజీవదహమైన వారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వారి ఇళ్లకు నిప్పంటించే ముందు తీవ్రంగా కొట్టినట్లు నివేదికలో ఉన్నట్లు తేలింది. వీరి శరీరాలపై తీవ్ర గాయాలున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సీఎం మమతా బెనర్జీ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బోగ్ టూయి గ్రామానికి వెళ్లి బాధితులను ఆమె పరామర్శించనున్నారు. ఇక ఈ ఘటనలో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఈ ఘటనపై కోల్ కతా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై విచారణ చేపట్టింది కూడా. తక్షణం బోగ్ టూయి గ్రామాన్ని సందర్శించి… ఫోరెన్సిక్ పరీక్షకు అవసరమైన నమూనాలు సేకరించాలని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీని ఆదేశించింది. ఆ ప్రాంతంలో 24 గంటలూ సీసీ కెమెరాలు ఉండే విధంగా చూడాలని ఆదేశాల్లో పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)