ఇండియాకు చౌకగా రష్యా క్రూడాయిల్‌ ?

Telugu Lo Computer
0


రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మొదలు కాక ముందు ఉన్న రేటులో 35 డాలర్ల వరకు డిస్కౌంట్‌ ఇస్తామని కూడా రష్యా ప్రకటించింది.  యుద్ధం మొదలు అవ్వక ముందు బ్యారెల్ బ్రెంట్ క్రూడ్‌ 80 - 90 డాలర్ల దగ్గర ట్రేడయ్యింది. ఏడాదికి 15 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను ఇండియా కొనేలా చేయాలని రష్యా చూస్తోంది. మన ప్రభుత్వం కూడా రష్యా క్రూడాయిల్ ఉరల్స్‌ను కొనడానికి మొగ్గు చూపుతోంది. ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో రష్యాపై యూఎస్‌, యురోపియన్ యూనియన్‌, యూకేలు ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో రష్యా క్రూడాయిల్‌, గ్యాస్‌కు డిమాండ్‌ తగ్గిపోయింది. వీటి రేట్లు పడిపోయాయి. దీన్ని ఆసియా దేశాలు అవకాశంగా చూస్తున్నాయి. చైనా వంటి దేశాలు ఇప్పటికే రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ కొంటున్నాయి. మరోవైపు రష్యా - రూబుల్‌ పేమెంట్ మెకానిజమ్‌ను తీసుకొద్దామనే ప్రపోజల్‌ను రష్యా ప్రభుత్వం ఇండియా ముందు ఉంచింది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్‌ లావ్రోవ్‌ రెండు రోజుల పర్యటనలో దీనిపై ఓ నిర్ణయం వెలువడనుంది. దేశ ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు రష్యా క్రూడాయిల్‌ను అమ్మే థర్డ్ పార్టీ కంపెనీల నుంచి ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నాయి. రష్యా ప్రభుత్వం నుంచి డైరెక్ట్‌గా క్రూడాయిల్‌ను కొనే ఆలోచనలో ప్రభుత్వ కంపెనీలు ఉన్నట్లు  తెలుస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కి, రష్యా ప్రభుత్వ కంపెనీ రోస్నెఫ్ట్‌ పీజేఎస్‌సీకి మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాదికి కనీసం 1.5 కోట్ల బ్యారెళ్ల రష్యా క్రూడాయిల్‌ను కొనాలని ఈ ఒప్పందంలో ఉండొచ్చని తెలుస్తుంది 

Post a Comment

0Comments

Post a Comment (0)