భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 31 March 2022

భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర


చమురు సంస్థలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచేశాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరపై ఏకంగా రూ. 250 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపాయి. తాజాగా పెంచిన ధరతో హైదరాబాద్‌లో ఈ సిలిండర్ ధర రూ. 2,186 నుంచి రూ. 2,460కి పెరిగింది. ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2253కు చేరింది. కోల్‌కతాలో రూ.2,351, ముంబైలో రూ.2,205, చెన్నైలో రూ.2,406 గా ఉంది. అయితే ప్రస్తుతానికి గృహ అవసరాలకోసం వినియోగించే 14 కిలోల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ఫలితంగా దాని ధర రూ. 1002 వద్ద నిలకడగా ఉంది. 10 రోజుల కిందటే డొమెస్టిక్ సిలిండర్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. వాణిజ్య సిలిండర్ ధరలను పెంచడంతో టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, మెస్‌లలో రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. 

No comments:

Post a Comment