జగన్‌ది దశ, దిశలేని ప్రభుత్వం!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో దిశ, దశ లేని ప్రభుత్వం పాలన చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన మాత్రమేనాని  రెండు నెలల క్రితమే అమిత్ షా మాకు ఈ విషయం పై దిశానిర్దేశం చేశారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. వలంటీర్ వ్యవస్థతో ప్రజాస్వామ్య వ్యవస్థను సీఎం నాశనం చేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థకి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ ద్వారా అమలవుతున్న శక్తి కేంద్రం. మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించాలి. కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించి జగన్ కూడా తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. 14, 15వ ఆర్దిక సంఘం నుంచి గ్రామాల అభివృద్ధికి మోడీ నిధులు కేటాయించారు. సర్పంచుల ఆధారంగా నిధులు ఇస్తున్న శక్తి నరేంద్ర మోడీ. ప్రజలకు ఇచ్చే రూ. 1 కిలో బియ్యం ఖర్చు కేంద్రానిదే. ఇంకా మధ్యాహ్న భోజన పధకం, స్కూల్ యూనిఫాం, పాఠశాలలు అభివృద్ధికి మోడీ నిధులిచ్చారు. జగన్ నవరత్నాలిస్తే. మోడీ డజన్ల కొద్దీ రత్నాలు ఇచ్చారు. జగన్ పధకాలకు అప్పులు చేసి.. అప్పులు పుట్టని పరిస్థితికి వచ్చారు. మూడు వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లు వేస్తామని కేంద్రం చెప్పింది. రైల్వేకు రూ. 64 వేల కోట్లు కేటాయించారు. జగన్ మాత్రం కాగ్ రిపోర్టులకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. బీజేపీకి ఓట్లు పడవన్న మంత్రి వెల్లంపల్లి చర్చకు రావాలి. ఎవరు ఎన్నెన్ని నిధులిచ్చారో బహిరంగంగా చర్చిద్దాం. మోడీకి ఓటేయాలని వెల్లంపల్లితోనే చెప్పిస్తాం. ఏపీలో బీజేపీ రాజకీయం చేయడం ప్రారంభించింది. భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలు నిర్ణయాలు చేస్తే బీజేపీ నిలదీస్తుందన్నారు. రాజధానిని కట్టలేని చేతకాని ప్రభుత్వం. అమరావతిని చంపేద్దామని కుట్రలు చేస్తున్నారు. మీరు కేపిటల్ కట్టకున్నా.. బీజేపీ రహదారుల అభివృద్ధి, మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణం చేశాం. యూనివర్శిటీలు, ఆసుపత్రులు కట్టి విద్యార్ధులకు, పేదలకు సేవలు అందించాం. అమరావతి నుంచి అనంతపురం వరకు రూ. 10 వేల కోట్లతో ఎక్స్ ప్రెస్ రహదారిని నిర్మిస్తున్నాం. రాజకీయ నాయకుల్లారా మాయ మాటలు, కాకమ్మ కబుర్లు మానేయండి. బీజేపీ మంత్రం అభివృద్ నాలుగు రాష్ట్రాల్లో అదే మా గెలుపు తంత్రం. ఏపీకి చంద్రబాబు హయాంలో రూ. 35 వేల కోట్లు, వైసీపీ హయాంలో రూ. 36 వేల కోట్లు కేంద్రం ఇచ్చింది. నరేగా కింద నిధులు ఇచ్చే కేంద్రం పోలవరం నిర్మాణానికి ఎందుకు ఇవ్వం. ఇక నుంచి బీజేపీపై కూతలు, కోతలు కూయలేరు. శక్తి కేంద్రం ద్వారా ప్రజలకు పార్టీని మరింత చేరువ చేసేలా అందరూ అడుగులు వేయాలని  ఏపీ అధ్యక్షుడు బీజేపీ  సోము వీర్రాజు అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)