ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నా : శ్రీశాంత్‌

Telugu Lo Computer
0


ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శ్రీశాంత్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమని, ఆ స్థాయికి చేరేందుకు సహకరించిన కుటుంబ సభ్యులకు, జట్టు సహచరులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని చాలా బాధతో, బరువెక్కిన హృదయంతో ప్రకటిస్తున్నానని తెలిపాడు. యువతరానికి అవకాశం ఇచ్చేందుకు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నానని వెల్లడించాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)