తెలంగాణ నిరుద్యోగులకు ఉచిత కోచింగ్

Telugu Lo Computer
0



పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నంచే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ ఇస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. అందు కోసం పోలీసులకు ఆదేశాలను సైతం జారీ చేశారు. జిల్లాల పరిధిలో, కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేకంగా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. నిన్న సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగ ఖాళీల్లో కేవలం హోం శాఖ లోనే 18,334 ఖాళీలు ఉన్నాయి. వాటిని అతి త్వరలోనే భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి పోలీసు ఉద్యోగాల భర్తీ సమయాల్లో రాష్ట్ర పోలీసులకు నిరుద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. అంతే కాకుండా ఆర్థికంగా వెనకబడిన అభ్యర్థులకు వసతి సౌకర్యం కూడా ఇస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)