మరోసారి పెట్రో బాదుడు!

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటర్ పెట్రోల్, డీజిల్ పై 80 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఈ వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 97.81, డీజిల్ రూ. 89.07గా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ 84 పైసలు, డీజిల్ 85 పైసలు చొప్పన పెరిగింది. దీంతో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 112.51, డీజిల్ రూ. 96.70కు చేరాయి. చెన్నైలో పెట్రోల్, డీజిల్ 76 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.93.71కు పెరిగింది. కోల్ కతాలో పెట్రోల్ 84 పైసలు, డీజిల్ 80 పైసలు చొప్పున పెరిగింది. దీంతో కోల్ కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.34, డీజిల్ రూ.91.42కు చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 90 పైసలు, డీజిల్ 87 పైసల చొప్పున పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ పై 88, లీటర్ డీజిల్ పై 84 పైసలు పెరిగింది. దీంతో గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.112.96, లీటర్ డీజిల్ 98.94కు చేరాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.112.76, లీటర్ డీజిల్ 98.74కు పెరిగింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో చమురు కంపెనీలు లీటరు డీజిల్ పై రూ.13.1 నుంచి రూ.24.9 వరకు, పెట్రోల్ పై రూ.10.6 నుంచి రూ.22.3 వరకు పెంచే అవకాశం ఉందని వ్యాపారవర్గాల అంచనా.

Post a Comment

0Comments

Post a Comment (0)