ఉచిత వైద్యం ఏమైంది? :

Telugu Lo Computer
0


కోవిడ్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ బాగా ఇబ్బందులు పడిందని, దీని కారణంగా సామాన్యుల మరణాలు పెరిగాయన్న రిపోర్టును రాహుల్ ఈ సందర్భంగా ఉటంకించారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకానికి ఎంతో హైప్ ఇచ్చిందని, ఆ పథకం కింద కోవిడ్ రోగులకు ఉచిత వైద్యం అందివ్వలేదని రాహుల్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. కోవిడ్ రోగులకు ఉచిత వైద్యం అందిందా? అందలేదే? పేద ప్రజలకు కనీస ఆదాయమైనా వస్తుందా? రావట్లేదు. కుప్పకూలుతున్న చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు ఊరట లభించిందా? లేదు. వీటిని ప్రధాని ఏమాత్రం పట్టించుకోవడమే లేదు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీంతో పాటు వీటికి సంబంధించిన రిపోర్టులను కూడా రాహుల్ ట్యాగ్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)