ఎన్ఐఏ అదుపులో విశాఖ నేవీ అధికారులు

Telugu Lo Computer
0


పాకిస్తానీ ఏజంట్ల గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. గుజరాత్, గోద్రా, బుల్దానా, మహారాష్ట్ర, విశాఖ లో ఎన్ఐఏ సోదాలు చేసింది. అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు పలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే కీలక సూత్రధారి యాకూబ్ గిటేలి, ముగ్గురు ఏజంట్లతో పాటుగా 11 మంది నేవీ అధికారులను అరెస్టు చేశారు. భారత నౌకాదళానికి సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించేందుకు పాకిస్తాన్ ఏజంట్లు గూఢచర్యానికి పాల్పడ్డారు. పలువురు యువ నేవీ అధికారులను ఐఎస్ఐ ఏజంట్లు హానీట్రాప్ చేశారు. యువతిగా నమ్మించి నేవీ అధికారులతో ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకుని వాళ్ల కలదలికలు తెలుసుకున్నారు. ఇదే క్రమంలో నౌకలు, సబ్ మెరైన్లు, నేవీ ఉన్నతాధికారులకు సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించారు. దీనిపై అనుమానం వచ్చిన ఏపి కౌంటర్ ఇంటిలిజెన్స్, నేవీ ఇంటిలిజెన్స్, సెంట్రల్ ఇంటిలిజెన్స్ పోలీసులు డాల్ఫిన్ నోస్ పేరుతో దర్యాప్తు చేపట్టారు. గూఢచర్యం బయటపడటంతో 11 మంది యువ నేవీ అధికారులను, నలుగురు ఐఎస్ఐ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)