వంద నోట్‌పై నేతాజీ బొమ్మ ముద్రించాలి

Telugu Lo Computer
0


లెర్నింగ్ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తోపాటు డాక్టర్ పద్మజారెడ్డి, ఎంవీఆర్ శాస్త్రి కూడా పాల్గొన్ననారు. ఎంవీఆర్‌ శాస్త్రి రచించిన నేతాజీ గ్రంథ సమీక్షలో మాట్లాడిన పవన్ కల్యాణ్‌ స్వాతంత్ర్య ఉద్యమం కోసం జైహింద్‌ నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్, అలాంటి వ్యక్తిని మన దేశం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన్ని గౌరవించుకోలేకపోతే మనం భారతీయులం అని చెప్పుకోవడానికి అర్హత లేదన్నారు. అలాంటి చాలా మంది వ్యక్తుల బలిదానాల వల్లే నేడు మనమంతా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నామన్నారు. అలాంటి వ్యక్తి కోసం నేటి తరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలను నవ్వుతూ ఇచ్చేని సుభాష్ చంద్రబోస్‌ అస్థికలను నేటికీ మన దేశానికి తెచ్చుకోలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన చెందారు. టోక్యోలోని రెంకోజీ అనే చిన్న ఆలయంలో ఇప్పటికీ ఆయన అస్థికలు ఉన్నాయని అక్కడి నుంచి తీసుకురావడానికి రెండు మూడు కమిటీలు పనిచేసినా సత్ఫలితాలు ఇవ్వలేదన్నారు. ఇది నాయకులు అనుకుంటే మాత్రమే అయ్యే పని కాదని... దేశ ప్రజలు ముఖ్యంగా నేటి తరం యువత అనుకుంటే అయ్యే కార్యమని అభిప్రాయపడ్డారు. అసలు అవి నేతాజీ అస్థికలో కాదో తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేస్తే సరిపోతుందన్ననారు పవన్. నేతాజి అస్థికలు తిరిగి భారత్‌దేశానికి రావాలని బలంగా కోరుకున్న వ్యక్తుల్లో తాను ఒకడినని పేర్కొన్నారు. రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు రెడ్‌పోర్ట్‌కు రావాలి అక్కడ జాతీయ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. కనీసం వందరూపాయల నోట్‌పై నేతాజి బొమ్వ ముుద్రించాలని.. అస్థికలను భారత్‌కు రప్పించేలా ఉద్యమానికి హైదరాబాద్‌ నుంచి సిద్ధమవ్వాలన్నారు పవన్ కల్యాణ. మనం నేతాజీలా యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని చేతిలో సెల్‌ఫోన్‌తో ప్రభుత్వాలపై, నాయకులపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో మొదలవ్వబోయ్యే ఉద్యమం వైపు ఏదో ఒకరోజు దేశం మొత్తం చూసేలా గుర్తించేలా ప్రయత్నిద్దామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)