అమెరికా కంటే కెనడాపైనే మోజు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 5 March 2022

అమెరికా కంటే కెనడాపైనే మోజు!


భారతీయ యువత ఇంజినీరింగ్ డిగ్రీ పట్టా పుచ్చుకుని ఎంఎస్ అటుపై సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగాల కోసం అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాలకు వెళుతుంటారు. ప్రత్యేకించి ప్రతి భారతీయ యువకుడు అమెరికాకు వెళ్లడానికి ఇష్టపడుతుంటాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అమెరికా కంటే కెనడాకు వెళుతున్న ఇండియన్స్ పెరిగిపోయారు. అమెరికాలో పర్మినెంట్ రెసిడెన్స్‌కు రిలయబుల్ రూట్‌గా పరిగణించే హెచ్‌-1బీ వీసాలు పొందడం, వాటి పునరుద్ధరణకు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో యువ ఇండియన్స్ దృష్టి మళ్లింది. దీన్ని కెనడా సానుకూలంగా మార్చుకుంటున్నదని టోరెంటో కేంద్రంగా పని చేస్తున్న ఇమ్మిగ్రేషన్ లా ఫర్మ్ రెకాయి ఎల్ఎల్‌పీ ఫౌండర్ పీటర్ రేఖాయి చెప్పారు. కెనడా ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో ప్రతిభావంతులను ఆకర్షించడానికి కార్పొరేట్ సంస్థలకు తేలికైంది. దీనికి తోడు భారీ స్థాయిలో న్యూ పర్మినెంట్ రెసిడెంట్స్ సంఖ్య పెంచడానికి ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌ను కెనడా ప్రభుత్వం విస్తరిస్తున్నది. దీంతో కెనడా ఉన్నత విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఇంటర్నేషనల్ విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి. ఇందుకోసం కెనడా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ప్లాన్లు సిద్ధం చేసుకున్నది. 2022లో 4,31,645 మంది, 2023లో 4,47,055 మంది, 2024లో 4.51 లక్షల మందికి శాశ్వత రెసిడెన్స్ హోదా కల్పించాలని నిర్ణయించింది. 4.05 లక్షల మందికి పైగా ఒక ఏడాదిలో పర్మినెంట్ రెసిడెన్స్ హోదా కల్పించడం కెనడా చరిత్రలోనే తొలిసారి. అమెరికాలోని కార్పొరేట్ సంస్థల్లో పని చేయడానికి వెళ్లాలంటే విదేశీ నిపుణులకు హెచ్‌-1బీ వీసాలు తప్పనిసరి. డొనాల్డ్ ట్రంప్ హయాంలో హెచ్‌-1బీ వీసాల జారీ, పునరుద్ధరణ ప్రక్రియ కఠినతరం చేయడంతో ఇబ్బందులు తలెత్తాయి. 2016-19 మధ్య అమెరికా యూనివర్సిటీల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎన్‌రోల్‌మెంట్ ఏడు శాతం తగ్గితే, కెనడా కాలేజీల్లో, యూనివర్సిటీల్లో 52 శాతం పెరిగింది. 2016, 2020, 2021 మధ్య కెనడాలో భారతీయ పర్మినెంట్ రెసిడెంట్స్ 115 శాతం పెరిగారని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఏపీ) తెలిపింది. 2016-19 మధ్య అమెరికాలో ఎమ్మెస్ చేసే సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ విద్యార్థుల సంఖ్య 40 శాతం తగ్గితే, కెనడాలో 182 శాతం పెరిగింది. దీన్ని బట్టి గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగాలు పొందడానికి పర్మినెంట్ వీసా పొందడానికి భారతీయులకు కెనడా పాపులర్ కేంద్రంగా నిలుస్తున్నది. 2016-17 నుంచి 2019-20 మధ్య సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ కోసం అమెరికా యూనివర్సిటీల్లో పేరు నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య సుమారు 40 శాతం అంటే 31,800 మంది తగ్గిపోయారు.


No comments:

Post a Comment