గుజరాత్ లో విందు భోజనం ఆరగించిన 1200 మంది అస్వస్థత

Telugu Lo Computer
0


గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత తన కుమారుడు పెళ్లిని ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లికి భారీ సంఖ్యలో అతిథులు తరలివచ్చారు. విందు భోజనం ఆరగించిన చాలా మందికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. విందులో ఏర్పాటు చేసిన ఆహార నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ ఘటనపై ఫుడ్ అండ్ డ్రగ్ విభాగం అధికారులు దర్యాప్తు చేపట్టారు. విందులో అతిథులు వడ్డించిన ఆహార పదార్థాల్లో మాంసాహారం కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ విందులో ఉపయోగించిన మాంసం నిల్వ చేయడం వల్ల ఇలా జరిగిందా? లేక వేరే కారణాలా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)