శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం

Telugu Lo Computer
0


శ్రీలంకలో మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. నిత్యవసర వస్తువులు దొరకక ప్రజలు నానా  ఇబ్బందులు పడుతున్నారు. ఆహార పదార్థాలు, మిల్క్​ పౌడర్​, మెడిసిన్​, వంట గ్యాస్​, ఇంధనం వంటి వాటికి తీవ్రమైన కొరత ఏర్పడింది. జనం పెట్రోల్​, డీజిల్ కోసం బంకుల వద్ద కిలో మీటర్ల మేర క్యూ కడుతున్నారు. ఇంధన కొరత కారణంగా ఇళ్లకు విద్యుత్​ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వ్యవస్థలోకి కరెన్సీని భారీగా చొప్పించేందుకు ఆ దేశ రిజర్వు బ్యాంక్ ఈ నెల ఆరంభంలో అనుమతినిచ్చిన కారణంగా ధరలు నిత్యవసరాల ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. తీవ్రమైన ద్రవ్యోల్బణం వల్ల ఆహార పదార్థాలు, పానియాల ధరలు భారీగా పెరిగాయి. రిటైల్ స్టోర్ల వద్ద కూడా జనాలు గంటలతరబడి వేచి చూడాల్సిన  పరిస్థితి తలెత్తింది. కిలో బియ్యం ధర రూ.500లకు చేరింది. 400 గ్రాముల మిల్క్​ పౌడర్ ధర రూ.790కి చేరింది. కేవలం మూడు రోజుల్లోనే దీని ధర రూ.250 పెరిగింది. కిలో చక్కెర ధరర రూ.290 వద్దకు చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)