ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆయనతో పాటు కేశవ ప్రసాద మౌర్య, బ్రజేష్ పాఠక్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో పాటు కేబినెట్ మంత్రులుగా సురేశ్ కుమార్ ఖన్నా, సూర్య ప్రతాప్ షాహి, స్వతంత్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, లక్ష్మీ నారాయణ చౌదరి, జైవీర్ సింగ్, ధర్మపాల్ సింగ్, నంద గోపాల్ నంద, భూపేంద్ర సింగ్ చౌదరి, అనిల్ రాజ్‌బర్, జితేంద్ర ప్రసాద, రాకేశ్ సచాన్, అరవింద్ కుమార్ శర్మ, యోగేంద్ర ఉపాధ్యాయ్, అశిశ్ పాటిల్, సంజయ్ నిషద్ ప్రమాణం చేశారు. స్వతంత్ర్య హోదాతో కూడిన మంత్రులుగా నితిన్ అగర్వాల్, కపిల్ దేవ్ అగర్వాల్, రవీంద్ర జైశ్వాల్, సందీప్ సింగ్, గులాబ్ దేవీ, గిరీశ్ చంద్ర యాదవ్, ధర్మవీర్ ప్రజాపతి, అసిమ్ అరుణ్, జేపీఎస్ రాథోడ్, దయాశంకర్ సింగ్, నరేంద్ర కశ్యప్, దినేశ్ ప్రతాప్ సింగ్, అరుణ్ కుమార్ సక్సేనా, దయాశంకర్ మిశ్రా దయాలు ప్రమాణం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)