వీడియో చూపించి నిత్యం అత్యాచారం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 10 March 2022

వీడియో చూపించి నిత్యం అత్యాచారం


రాజస్థాన్‌ చురులోని కొత్వాలి ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతోంది. 6 నెలల క్రితం అదే నగరానికి చెందిన సచిన్ అనే యువకుడు ఐస్‌క్రీమ్ తినిపిస్తానని చెప్పి కేఫ్‌కు తీసుకెళ్లాడు. తెలిసిన వాడే కదా అని ఆమె అతడి వెంట వెళ్లింది. ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత మా ఇళ్లు చూపిస్తానని చెప్పి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఆమె ఇంటికి తీసుకెళ్లిన తర్వాత సచిన్ రేప్ చేశాడు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియో తీసి బెదిరించాడు. ఎవరికైనా చెబితే వీడియో లీక్‌ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. అలా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అత్యాచార వీడియోను లీక్ చేశాడు. తన ఫ్రెండ్ షారుక్‌కి చూపించాడు. అనంతరం ఇద్దరు కలిసి ఆమెపై పలుమార్లు రేప్ చేశారు. వీడియో పేరుతో బ్లాక్ మెయిల్ చేసి చురులోని లక్కీ కేఫ్‌, హుక్‌ కేఫ్‌, ప్రిన్స్‌ కేఫ్‌లకు తీసుకెళ్లి రెండ్రోజుల పాటు పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. నిందితులు సచిన్‌, షారుక్‌లు ఆ వీడియోను మరికొంత మందికి షేర్ చేశారు. తమ స్నేహితులు ఇర్ఫాన్‌, ఆషిక్‌, ప్రిన్స్‌తో పాటు మరొకరికి కూడా చూపించారు. ఈ క్రమంలో వారు కూడా ఆమెను రేప్ చేసేందుకు ప్రయత్నించారు. శారరీక సంబంధంకోసం ఒత్తిడి తెచ్చారు. లేదంటే వీడియోను యూట్యూబ్‌లో పెడతామని బెదిరించారు. లోలోన కుంగిపోతూ నరకయాతన అనుభవించింది. ఓ రోజు ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆమె సాయంత్రమైనా ఇంటికి రాలేదు. చీకటి పడ్డాక ఇంటికి వెళ్లడంతో.. ఎక్కడికెళ్లావని తల్లి నిలదీసింది. అప్పుడు ఈ కథంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. నిత్యం నరకం చూస్తున్నాని చెప్పి వెక్కివెక్కి ఏడ్చింది. అనంతరం తన కూతురిని వెంటబెట్టుకొని..మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

No comments:

Post a Comment