తెలంగాణ లోని ఖమ్మం జిల్లా, పాల్వంచకు చెందిన తాలూరి సాయికృష్ణ టిసిఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు ఆన్లైన్లో గుర్తు తెలియని యువతులతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు. న్యూడ్ కాల్స్‌కు బానిసగా మారిని యువకుడు మిగతా వారితో కూడా అలాగే మాట్లాడాలని ప్లాన్ వేశాడు. ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ఐడిని క్రియేట్ చేసి దాని ద్వారా మహిళకు ఇన్‌స్టాగ్రాంలో న్యూడ్ ఫొటోలు పంపిస్తున్నాడు. గత కొంత కాలం నుంచి బాధితురాలికి అసభ్య ఫొటోలు వస్తుండడంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ శంకర్ కేసు దర్యాప్తు చేశారు.
No comments:
Post a Comment