భార్య నుంచి భరణం కోరిన భర్త !

Telugu Lo Computer
0


1992లో ఓ జంటకు వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో భర్త నుంచి విడాకులు ఇప్పించాలని 2015లో భార్య నాందేడ్​ సివిల్​ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు దంపతులకు 2015 లోనే విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలో హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్​ 24, 25 ప్రకారం భార్య నుంచి శాశ్వత భరణం, జీవనాధార ఖర్చులు ఇప్పించాలని కోరుతూ ఆమె భర్త పిటిషన్​ వేశాడు. వినటానికి ఇది వింతగా అనిపించొచ్చు. కానీ కొన్ని కేసుల్లో జరిగే ప్రత్యేక సందర్భమే ఈ కేసులోను జరిగింది. 'నాకు ఎటువంటి జీవనాధారం లేదని, భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటోందని ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా ఆ స్థానంలో ఉండటానికి తాను ఎంతో కష్టపడ్డాను కాబట్టి నాకు భరణం ఇప్పించాలి అని పిటీషన్ లో సదరు భర్త విన్నవించుకున్నాడు. భర్త పిటిషన్​ను పరిశీలించిన నాందేడ్​ సివిల్​ కోర్టు విచారణకు స్వీకరించింది. అంతేకాదు కేసును క్షణ్ణంగా పరిశీలించి సదరు భర్త పరిస్థితిని అర్థం చేసుకుంది. దీంతో ఆ భార్య భర్తకు భరణం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సదరు భార్య నాందేడ్​ సివిల్​ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ ఔరంగాబాద్​ హైకోర్టును ఆశ్రయించింది. విడాకులు మంజూరయ్యాక వారి బంధం పూర్తిగా ముగిసిపోయిందని కాబట్టి ఎటువంటి భరణం, ఇతర ఖర్చులు ఇవ్వాల్సిన అవసరం లేదని పిటిషనర్​ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ హిందూ వివాహ చట్టంలోని సెక్షన్​ 25 ప్రకారం ఎప్పుడైనా భరణం కోరుతూ పిటిషన్​ వేయవచ్చన్నారు భర్త తరఫు న్యాయవాది రాజేశ్​ మెవారా. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు భర్తకు భార్య భరణం ఇవ్వాలని తీర్పు వెల్లడించింది. సివిల్​ కోర్టులో వాదనలు, సమర్పించిన డాక్యుమెంట్లు, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన హైకోర్టు సివిల్​ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. భర్తకు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)