ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టం పరిధి కుదింపు

Telugu Lo Computer
0


ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, అస్సాం, మణిపూర్‌లలో 60 ఏళ్లకుపైగా అమలు అవుతున్న ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్సెషల్ పవర్స్ యాక్ట్ ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఓ ప్రకటన చేశారు. నాగాలాండ్‌, అస్సాం, మణిపూర్‌ రాష్ట్రాల్లో దశాబ్దాల తరబడి అమలు అవుతున్న ఈ చట్టాన్ని ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కుదిస్తోందని ఆయన ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాల్లో చాలా కాలం కిందే అమల్లోకి వచ్చిన ఈ చట్టంతో సైనిక బలగాలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వబడ్డాయి. ఈ చట్టం ప్రకారం ఈ రాష్ట్రాల్లోని ఏ ప్రాంతంలో అయినా, ఏ వ్యక్తిని అయినా ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే అదుపులోకి తీసుకునే అధికారం సైనిక బలగాలకు ఉంది. ఎవరినైనా అదుపులోకి తీసుకంటే సైన్యాన్ని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. దీంతో సామాన్యులు తమకు అన్యాయం జరిగినా ప్రశ్నించే సాహసం చేయలేకపోయేవారు. ఈ చట్టం ఎత్తివేతకు ఈ రాష్ట్రాల్లోని సంఘాలు పలు ఆందోళనలు కూడా చేపట్టాయి. తమ ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగి శాంతి నెలకొందని, ఈ కారణంగానేఈ చట్టం అమలు అయ్యే ప్రాంతాలను కుదిస్తున్నామని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు దారులను అణచివేత కోసం ఈ చట్టాన్ని గత ప్రభుత్వాలు అమలు చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చట్టాన్ని ఎత్తివేయాలని మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందిన షర్మిల దాదాపు 20 ఏళ్లు నిరాహార దీక్ష చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆమె దీక్షను ఏమాత్రం పట్టించుకోలేదు. 16 ఏళ్లపాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టిన ఇరోం షర్మిల దీక్ష విరమించిన తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన నిరాహార దీక్షతో సాధించలేదనిది రాజకీయాల్లో అడుగు పెట్టి చట్టసభలో సాధించాలనుకున్నారు. 2017 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో తీవ్రంగా కలత చెందిన షర్మిల రాజకీయాల నుంచి కూడా తప్పుకుని వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించారు. భారత సంతతికి చెందిన బ్రిటీషర్ డేస్‌మోండ్ ఆంథోని అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొడైకెనాల్‌లో స్థిరపడ్డారు. అలా ఇరోమ్ షర్మిల 46 ఏట 2019 మార్చిలో ఆడ కవలలకు జన్మనిచ్చారు. మాతృ దినోత్సవం నాడే షర్మిల పిల్లలకు జన్మనివ్వడం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)