అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటే పార్లమెంట్‌ను రద్దు చేస్తా !

Telugu Lo Computer
0


తనకు వ్యతిరేకంగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటే పార్లమెంట్‌ను రద్దు చేస్తానని ప్రతిపక్షాలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని ఇమ్రాన్ కోటరీలోని ఓ కీలక వ్యక్తి ప్రతిపక్ష నేత షహబాజ్ షరీఫ్‌కు చేరవేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేతలు ఓ చోట సమావేశమయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే ఇమ్రాన్ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం పాక్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిందని, దీనికి విరుగుడు ఇదేనని సందేశం పంపారు. ఒకవేళ తాను పంపిన ప్రతిపాదనకు ప్రతిపక్షాలకు అంగీకరించని పక్షంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాను రెడీగా ఉన్నానని తేల్చి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)