కిస్మిస్‌లు - ఉపయోగాలు !

Telugu Lo Computer
0


కిస్మిస్‌లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక గుప్పెడు కిస్మిస్‌లను రాత్రంతా నీటిలో నాన బెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను పరగడుపునే తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్ అనేక ప్రయోజనాలు  కలుగుతాయి. కిస్మిస్‌లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటి నీళ్లను తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఐరన్ బాగా ఉంటుంది. కనుక కిస్మిస్ నీళ్లను నెల రోజుల పాటు తాగితే శరీరంలో రక్తహీనత సమస్య తగ్గుతుంది. వీటిలో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నీళ్లను తాగితే  నీరసం, అలసట తగ్గుతాయి. జ్వరం త్వరగా తగ్గుతుంది. రోజూ శారీరక శ్రమ, వ్యాయామం ఎక్కువగా చేసేవారు ఈ నీళ్లను తాగితే శక్తి బాగా లభించి ఉత్సాహంగా మారుతారు. ఎంత పని చేసినా అలసిపోరు. చిన్నారులు అయితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి. చదువుల్లో రాణిస్తారు. ఈ నీళ్లను తాగడం వల్ల మలబద్దకం సమస్య ఉండదు. గ్యాస్‌, కడుపులో మంట కూడా తగ్గుతాయి. ఈ నీళ్లను నెల రోజుల పాటు తాగితే చర్మం కాంతివంతంగా ప్రకాశిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)