పచ్చికొబ్బరి - ప్రయోజనాలు

Telugu Lo Computer
0


పచ్చి కొబ్బరిని తినడంతో పటు కూరలు, పచ్చళ్ళు, పులుసులు, స్వీట్స్ , కుక్కిస్, బర్ఫీ, చాక్లెట్స్ మొదలైన వంటకాలు చేస్తారు. మామూలుగా పండగైనా శుభకార్యమైనా హైందవ సంప్రదాయంలో కొబ్బరి కాయలు కొట్టడం అనేది ఒక ఆచారం. దేవ దేవుడికి మదిలోని కోరికలు విన్నవించుకుని కోరికలు నెరవేరితే తల నీలాలు సమర్పిస్తానని, టెంకాయలు కొడతామని, ప్రదక్షిణలు చేస్తామని, ఉపవాస దీక్షలు చేస్తామని ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు దేవుడ్ని వాళ్ళ కోరికలు నెరవేర్చమని కోరుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఎటువంటి ఉపవాసాలు, దీక్షలు, వ్రతాలు చేపట్టినా ముందుగా దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టడం అనేది ఆనవాయితీ. కొన్ని ఇళ్లలో ప్రతిరోజు ఏదో ఒక పూజ, వ్రతం పేరుతో కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. అలా కొట్టిన కొబ్బరికాయలు పక్కన పడేస్తూ ఉంటారు. పక్కన పడేసే బదులు కొబ్బరి తింటే కలిగే అటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలిస్తే కొబ్బరిని అలా పడేయడం జరగదు. కొబ్బరి తినడం వల్ల ఉష్ణం తగ్గిపోతుంది. ఒంటికి చలువ చేస్తుంది. పచ్చికొబ్బరిలో చమురు అధికంగా ఉండి మంచి రుచికరంగా ఉంటుంది. పచ్చికొబ్బరి తినడం వల్ల ఒంట్లోని వాతం కూడా తగ్గుతుంది. ఒంటి అలసటనీ కూడా దూరం చేస్తుంది. ఎండుకొబ్బరి కంటే కూడా పచ్చికొబ్బరి శ్రేష్టమైనది. కొబ్బరి తినడం వల్ల నోరు సువాసన కలిగి ఉంటుంది. చిగుళ్ళ వ్యాధిని కూడా దూరం చేస్తుంది. పచ్చికొబ్బరి పంచదార తో కలిపి తింటే రక్తం వృద్ధి చెందుతుంది. * లేత కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా ఒంటికి చలవ చేస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల దాహం తీరుతుంది. పొత్తికడుపును కూడా శుభ్రపరుస్తుంది. రతి క్రీడలో పాల్గొన్న తర్వాత లేత కొబ్బరి నీరు గనుక తాగితే సంభోగం వలన కలిగిన ఆయాసాన్ని తగ్గిస్తుంది. పచ్చికొబ్బరి మరియు కొబ్బరి నీరు ఎన్నో రోగాలను నివారించడమే కాక పురుషుల్లో వీర్యవృద్ధిని పెంపొందిస్తుంది. బలాన్ని కలిగిస్తుంది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)