ఆర్మీలో జాయిన్ అవ్వడానికి పరుగే...పరుగు!

Telugu Lo Computer
0


నోయిడా ఖాళీ వీధుల్లో కల నెరవేర్చుకునేందుకు కిలోమీటర్ల తరబడి పరుగు తీస్తూ ప్రయత్నిస్తున్నాడు. ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రీ కంట పడ్డాడు 19 ఏళ్ల యువకుడైన ప్రదీప్ . నోయిడా వీధుల్లో పరుగెత్తుతూ వెళ్తున్నాడు. కుతూహలంతో యువకుడిని ప్రశ్నించాడు ఫిల్మ్ మేకర్. అంతే ఆ ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. యువకుడి పరుగు సాగుతూనే ఉంది. అలా తాను రోజూ పది కిలోమీటర్లు పరిగెత్తుతూనే ఇంటికి వెళ్తానని చెప్పాడు. ప్రస్తుతం తాను మెక్ డొనాల్డ్ సెక్టార్ 16లో పనిచేస్తున్నానని చెప్తూనే వినోద్ కాప్రీ తన కారులో దించుతానని చెప్పినప్పటికీ నో చెప్పేశాడు. కారు ఎక్కితే తనకు ఈ రోజు పరిగెత్తే అవకాశం మిస్ అయిపోతానని, ఇలా పరుగు ప్రాక్టీస్ చేసి ఆర్మీలో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. ఉదయం సమయంలో పరిగెత్తడం ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని అడిగితే ఉదయం 8 గంటలకు లేచి పనికి వెళ్లడాని కంటే ముందే వంట చేయాలని రాత్రి పూటనే పది కిలోమీటర్ల పరుగు సాధ్యపడుతుందని చెప్పాడు. అలా ఇంటికి చేరుకున్న తర్వాత వంట చేసుకుని తిని తన తమ్ముడికి పెట్టాలట. మంచాన పడ్డ తల్లిని చూసుకుని తిరిగి తెల్లారే పనిలోకి రావాలని చెప్తున్నాడు ఆ టీనేజర్. ట్విట్టర్ లో పోస్టు చేసిన ఈ వీడియోను.. 53లక్షల మంది వీక్షించగా 2 లక్షల లైకులు సంపాదించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)