రాజ్యసభ ఎంపీలను నామినేట్ చేసిన ఆమ్ ఆద్మీ

Telugu Lo Computer
0


పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ రాజకీయాలపై పట్టుసాధించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్రం నుంచి ఐదుగురిని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఐదు రాజ్యసభ స్థానాలకు ఆప్ రాజ్యసభ అభ్యర్థులుగా క్రికెటర్ హర్భజన్ సింగ్, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్, ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ అశోక్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను రాజ్యసభకు నామినేట్ చేసింది. హర్భజన్ సింగ్ భారత క్రికెట్ జట్టులో స్పిన్ మాంత్రికుడిగా దేశ ప్రజలకు సుపరిచితమే. ఢిల్లీ రాజేందర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న రాఘవ్ చద్దా అతి చిన్న వయసులో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈయన పంజాబ్ ఆప్ పార్టీ ఇంచార్జ్ గా, ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు. పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు నూతన సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)