ఫేక్ సర్టిఫికెట్ ముఠా అరెస్ట్

Telugu Lo Computer
0


నిరుద్యోగులు మోసం చేస్తూ కోట్ల రూపాయలను మోసం చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ నగర పోలీసులు రట్టు చేశారు. ఇటీవల వరంగల్ జిల్లాలో ఈ నకిలీ సర్టిఫికెట్స్ దందా వెలుగు చూడడంతో దృష్టి సారించిన పోలీసులు నకిలీ సర్టిఫికెట్స్ పంపిణి చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్ అయిన ఇద్దరు నిందితుల్లో మాజీ పీసీసీ అధ్యక్షుడు, మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్న కొడుకు కూడా ఉన్నాడు. దీంతో ఈ దాందా వెనక ఇంకా ఎవరైనా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పివ్వడంతో పాటు వారికి ఫేక్ సర్టిఫికెట్స్‌ను అందిస్తుండడంతో వీరికి భారీ మొత్తంలో నగదు చెల్లించిన నిరుద్యోగులు మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్, జవహర్‌నగర్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టి ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఈ కేసులో హనుమకొండ జిల్లాకు పొన్నాల భాస్కర్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఈయన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సొంత అన్న కొడుకు కావడం సంచనలనంగా మారింది. రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తానంటూ పొన్నాల భాస్కర్ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పేవాడు. తనకు రైల్వే బోర్డులో పలుకుబడి ఉందని, అందువల్ల ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలోనే వివిధ ప్రక్రియల పేరుతో వారి నుంచి రూ.లక్షలు వసూలు చేశాడు.. ఆ తర్వాత రైల్వేలో టికెట్ కలెక్టర్, కమర్షియల్ క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన పొన్నాల భాస్కర్ నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు బాధితులకు ఇచ్చాడు. కాని అవి చివరికి ఫేక్ అని తేలడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు డబ్బుల కోసం డిమాండ్ చేశారు. దీంతో వారిని భయపెట్టేందుకు ముంబయి తీసుకువెళ్లి అక్కడ తీవ్రంగా హెచ్చరించాడు. డబ్బుల కోసం అడిగితే తీవ్రపరిణామాలు ఉంటాయని బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలోనే బాధితులు కొందరు హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పొన్నాల భాస్కర్‌తో పాటు రితేశ్ కుమార్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు రూ.9లక్షల నగదు, ఫేక్ రైల్వే ఐడీ కార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)