పేరు మార్చుకున్న రోషన్‌

Telugu Lo Computer
0


నిర్మల కాన్వెంట్‌ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ . ఈ సినిమా తర్వాత ఇటీవలె పెళ్లి సందD సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయినా రోషన్‌ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కానీ సరైన హిట్‌ మాత్రం పడలేదు. దీంతో తాజాగా ఈ యంగ్‌ హీరో తన పేరులోని స్పెల్లింగ్‌ను "Roshann" గా మార్చుకున్నాడు. న్యూమరాలజీ ప్రకారం తన పేరుకు అదనంగా 'n'ని జోడించాడు. మరి ఈ లాజిక్‌ రోషన్‌ కెరీర్‌కు ప్లస్‌ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇంతకుముందు తమన్నా, సాయి ధరమ్‌ తేజ్‌ సహా పలువురు సెలబ్రిటీలు న్యూమరాలజీ ప్రకారం తమ పేరును మార్చుకొని అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే.


Post a Comment

0Comments

Post a Comment (0)