పెన్షనర్లకు ఆధార్ గుర్తింపు తప్పనిసరి!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్లు ఇక ఆధార్ కార్డు ఆధారంగానే చెల్లిస్తారు. ఈ మేరకు పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించేందుకు ఆధార్ గుర్తింపు పత్రాన్ని వినియోగించాలని సూచనలు చేసింది. ప్రతి నెలా వృద్ధాప్య, వితంతు మరియు దివ్యాంగుల తది తర సామాజిక పెన్షన్లు అందుకునేవారు ఆధార్ కార్డ్, ఆధార్ అధంటికేషన్ కలిగి ఉండాలని గెజిట్ లో పేర్కొ న్నారు. ఎక్కడైనా ఆధార్ సెంటర్ లో అందుబాటులో లేకపోతే ప్రభుత్వం వారి కోసం ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. పింఛన్ చెల్లింపులకు సంబంధించి వేలిముద్రలు సరిగా పడకపోతే ఐరీష్/ ఫేస్ అథంటికేషన్‌, అదీ లేకపోతే ఆధార్‌ వన్‌ టైం పాస్‌ వర్డ్‌, వీలుకాకుంటే ఆధార్‌ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ రీడర్‌ ద్వారా పింఛన్లు అందించాలని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)