ఇక గుజరాత్ పై గురి....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 10 March 2022

ఇక గుజరాత్ పై గురి....!


స్థానిక పార్టీలను ఊడ్చి పారేసి అంచనాలకు మించి పంజాబ్ ను కైవశం చేసుకుంది విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ తదుపరి టార్గెట్ గుజరాత్ అని  తెలిపింది. పార్టీ స్థాపించాక ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న పార్టీ నెమ్మదిగా జాతీయ పార్టీగా ఆవిర్భవించి తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ క్రమంలో ఇక ఆప్ మరింత ఉత్సాహంగా ప్రధాని మోడీ అడ్డా గుజరాత్ ను కూడా దక్కించుకుంటాం అంటూ తెలిపింది. తొలుత ఢిల్లీ.. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు గుజరాత్ పై కన్నేసింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్ లో ఎన్నికలు రానున్నాయి. దీంతో గుజరాత్ లో పాగా వేసేందుకు ఆప్ ఇప్పుడు సన్నాహాలు మొదలు పెట్టింది. ట్విట్టర్ లో ఇందుకు సంబంధించి ఆప్ ఒక ట్వీట్ వేసింది. అందులో.. ''ఢిల్లీ, పంజాబ్ తర్వాత.. ఇప్పుడు గుజరాత్ ఆప్ ను కోరుకుంటోంది''అని పేర్కొంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ పంజాబ్ లో విజయం సాధించింది. సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించి మరీ ఎన్నికల బరిలో నిలిచి గెలిచింది. ట్వీట్ లో పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఫొటో తో పోస్టర్ కూడా కనిపిస్తోంది. 2022 ఏప్రిల్ లో గుజరాత్ రాష్ట్రంలో ఆప్ తిరంగా యాత్రను మొదలు పెట్టనుంది. అన్ని మండలాలు, పంచాయతీల పరిధిలో ఇది ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తో పాటు, పంజాబ్ సీఎంగా ప్రమాణం చేయనున్న భగవంత్ మాన్ కూడా త్వరలో గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

No comments:

Post a Comment