విశాఖ నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్‌ రైలు నడపాలి ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 16 March 2022

విశాఖ నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్‌ రైలు నడపాలి !


దక్షిణాదిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే విధంగా విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు బుల్లెట్‌ రైలును నడపాలని ఎంపీ భీశెట్టి వెంకటసత్యవతి కోరారు. పార్లమెంట్‌లో మంగళవారం జరిగిన బడ్జెట్‌ సమావేశంలో బుల్లెట్‌ రైలు, పర్యాటక ప్యాకేజీలపై మాట్లాడారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య నిత్యం పెరుగుతుందని గుర్తుచేశారు. ఈ మార్గంలో త్వరితగతిన వెళ్లే రైళ్లు నడపాలని ప్రయాణికుల నుంచి డిమాండ్‌ ఉందన్నారు. బుల్లెట్‌ రైలు నడిపితే ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. రాష్ట్రంలో పర్యాటక శాఖ 23 బౌద్ధ స్థలాలు, స్మారక చిహ్నాలను గుర్తించిందని, వాటిని విశాఖ, అమరావతి-నాగార్జునకొండ సర్క్యూట్‌లుగా విభజించిందన్నారు. బౌద్ధ ప్రదేశాలను కలుపుతూ ఐఆర్‌సీటీసీ నిర్వహించే పర్యాటక ప్యాకేజీని పెంచితే మరింత అభివృద్ధి సాధిస్తుందని సభలో ఎంపీ వివరించారు. 

No comments:

Post a Comment