ఉద్రిక్తంగా మారిన కలెక్టరేట్ల ముట్టడి

Telugu Lo Computer
0


విద్యారంగ సమస్యలు పరిష్కారించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం చలో కలెక్టరేట్ల ముట్టడిని నిర్వహించాయి. కలెక్టరేట్ల వద్ద పోలీసులు మోహరించి వారిని అడ్డుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ఏపీ సీఎం ఇంతవరకు విడుదల చేయలేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. కర్నూలు, కాకినాడ జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలెక్టరేట్‌ వద్ద ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా మెస్‌ ఛార్జీలను పెంచాలని డిమాండ్‌ చేశారు. జీవో నంబర్‌ 77ను రద్దు చేయాలని కోరారు. నూతన విద్యావిధానం వల్ల విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. విద్యా దీవెన పథకం కింద కొంతమందికి మాత్రమే రీయింబర్స్‌మెంట్‌ ఫీజు వచ్చిందని ఆరోపించారు. పీజీ విద్యార్థులకు విద్యాదీవెన ఇతర పథకాలు ఇవ్వబోమని ప్రభుత్వ ప్రకటన దారుణమని అన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలంటూ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. అంబేద్కర్‌ విగ్రహానికి నివాళి అర్పించి మెడకు ఉరి బిగించుకొని నిరసన తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)